– అరెస్ట్ చేసిన పోలీసులు
వరంగల్ క్రైం జ్వాల : మైనర్ పై అత్యాచారం చేసిన ఘటనలో ఓ సీఐ అరెస్ట్ అయ్యారు. కేయూ పోలీస్టేషన్లో గతంలో ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం సీఐగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్నారు. ఈ పోలీసు అధికారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్ళితే 2022 లో కేయూలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు అధికారికి స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలున్నాయి.
ఈ విషయంలో మహిళ భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా, ఏఆర్ కు అటాచ్ చేశారు. అనంతరం సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, అటునుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సదరు అధికారి.. ఇంకా మహిళతోనే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నరు. ఈ క్రమంలో సదరు మహిళ కూతురిపై కన్నేసిన పోలీసు అధికారి.. అత్యాచార యత్నం చేసినట్లు తెలిసింది. మైనర్ అయిన తన కూతురుపై పోలీసు అధికారి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఇటీవల కేయూలో మహిళ ఫిర్యాదు చేసింది.
విచారణ చేసిన కేయూ పోలీసులు.. గురువారం సదరు అధికారిపై అత్యాచార యత్నం, పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సదరు సీఐ పై గతంలోను ఇలాంటి వ్యవహారాల్లో తల దూర్చిన సంఘటనలు ఉన్నాయి.